Advertisementt

సూరి సినిమాలో అఖిల్‌ సరసన ఎవరో తెలుసా?

Sun 13th Sep 2020 07:30 PM
rashmika mandanna,surender reddy,akhil,most eligible bachelor,heroine  సూరి సినిమాలో అఖిల్‌ సరసన ఎవరో తెలుసా?
heroine selected for surender reddy and akhil film సూరి సినిమాలో అఖిల్‌ సరసన ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పూజాహెగ్డే, రశ్మికనే. వీరి చుట్టూనే హీరోల ప్రదక్షణ ఉంది. ప్రభాస్‌తో రాధేశ్యామ్ చేస్తున్న పూజాహెగ్డే అక్కినేని అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తుంది. రాధేశ్యామ్ ఇప్పట్లో అవ్వకపోయిన.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూట్ త్వరలోనే పూర్తవుతుంది. ఇక రష్మిక, అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీలో నటించాల్సి ఉండగా.. రామ్ చరణ్‌తో ఆచార్యలో నటించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా టాక్. అయితే తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో రశ్మిక పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం టాప్ హీరోయిన్ పూజాహెగ్డేని తీసుకుంటున్న టీం.. ఆమె క్రేజ్ మీదనే సినిమా విజయం ఆధారపడింది అంటుంటే.. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించే సినిమాలోనూ లక్కీ హీరోయిన్ రష్మిక అయితే బావుంటుంది. అక్కడ పూజా నిలబడితే.. ఇక్కడ రష్మిక అఖిల్‌ని నిలబెట్టాలంటున్నారు. అందుకే పూజాతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చేస్తున్న అఖిల్ సురేందర్ రెడ్డి సినిమాలో ఖచ్చితంగా రష్మికతో రొమాన్స్ చేస్తాడు.. వేరే ఆప్షన్ కూడా లేదనే టాక్ వినబడుతుంది. మరి బెల్లకొండ శ్రీనివాస్ లాగా చివరికి అఖిల్ కూడా హీరోయిన్స్‌ని నమ్ముకోవాల్సిన పరిస్థితి.

heroine selected for surender reddy and akhil film:

Rashmika in surender reddy and akhil combo film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ