Advertisementt

స్టూడియో యువ పేరుతో ఎంటర్టైన్మెంట్ ఛానల్!!

Sun 13th Sep 2020 07:01 PM
studio yuva entertainment,entertain youth,channel,start  స్టూడియో యువ పేరుతో ఎంటర్టైన్మెంట్ ఛానల్!!
Studio Yuva entertainment channel starts soon స్టూడియో యువ పేరుతో ఎంటర్టైన్మెంట్ ఛానల్!!
Advertisement
Ads by CJ

‘యువ’తరాన్ని ఉర్రూతలూగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న స్టూడియో యువ ఎ యునీక్ ఎంటర్టైన్మెంట్ ఛానల్!!

తెలుగులో న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పరిమితంగానే ఉన్నాయి. ఆ లోటు తీర్చేందుకు ‘స్టూడియో యువ’ పేరుతో ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అతి త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

యువతరాన్ని ఉర్రూతలూగించడమే లక్ష్యంగా సర్వ సన్నాహాలు చేసుకుంటున్న ఈ ఛానల్..  కుర్రకారు కోరుకునే వినోదంతోపాటు... విజ్ఞానం మరియు మానసిక వికాసంకు దోహదపడే విధంగా ఉంటుందని... ఆ మేరకు తమ ఛానల్‌ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దుతున్నామని ‘స్టూడియా యువ’ యాజమాన్యం చెబుతోంది.

విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రసారాలు ప్రారంభించుకునే ‘స్టూడియో యువ’ అన్ని ముఖ్య సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా లభ్యం కానుంది. ఇప్పటివరకు మన తెలుగులో యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ ఛానల్ రాలేదని... ‘స్టూడియో యువ’లో ప్రసారమయ్యే ప్రతి ప్రోగ్రాం యూత్‌ని విశేషంగా అలరిస్తుందని ‘స్టూడియో యువ’ ప్రతినిధి ఘంటాపథంగా చెబుతున్నారు!!

Studio Yuva entertainment channel starts soon:

Studio Yuva A unique entertainment channel gears up to Entertain Youth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ