ఓం శాంతి ఓం సినిమాతో సక్సెస్ ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న షారుక్, దీపికా కాంబో మళ్ళీ రిపిట్ కాబోతుంది. ఇప్పటి వరకూ వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్.. ఈ చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకున్నాయి. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారు. గత కొన్ని రోజులుగా సినిమాలు చేయకుండా ఉన్న షారుక్ ఖాన్, తన తర్వాతి చిత్రాన్ని మొదలెట్టబోతున్నాడు.
తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలో దీపికా హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత సినిమా మొదలుపెడుతున్న షారుఖ్ ఖాన్, వరుసగా సినిమాలని లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు. కరోనా వల్ల ఈ చిత్రాలన్నీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నాయి. షారుక్, దీపికా కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రం కూడా వచ్చే ఏడాదే మొదలవుతుందట. వరుస హిట్లు కొట్టిన ఈ కాంబో మరోసారి హిట్ కొట్టి షారుక్ ఖాన్ ని మళ్లీ రేసులోకి తీసుకొస్తుందేమో చూడాలి.