Advertisementt

నిర్మాతగా మారుతున్న గూఢాచారి హీరోయిన్...

Sat 12th Sep 2020 06:30 PM
shobita dhulipalla,doogachari,adavisesh,telugu,bollywood  నిర్మాతగా మారుతున్న గూఢాచారి హీరోయిన్...
Goodachari Heroine Starting Production house.. నిర్మాతగా మారుతున్న గూఢాచారి హీరోయిన్...
Advertisement
Ads by CJ

శోభిత ధూళిపాళ్ళ.. పుట్టింది తెనాలి. పెరిగింది వైజాగ్ లో. అడవిశేష్ సినిమా గూఢాచారి సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఐతే అదే ఆమె మొదటి తెలుగు సినిమా.. కానీ అంతకుముందే నటిగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. బాలీవుడ్ నుండి తెలుగుకి వచ్చిన శోభిత, గూఢాచారి తర్వాత మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ కనిపిస్తుంది. 

ఐతే తన రెండవ తెలుగు చిత్రం మేజర్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా చేస్తున్నాడు. హీరోయిన్ గా తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాకపోయినా, అటు బాలీవుడ్ తో సహా ఓటీటీలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న శోభిత, తన కెరీర్లో కొత్త మలుపు తీసుకుంటుంది. నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తానంటుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన శోభిత, రైటర్స్ కి ఆహ్వానం పలుకుతోంది.

మొత్తానికి హీరోయిన్ కాస్తా నిర్మాతగా మారుతుందన్నమాట. మరి హీరోయిన్ గా ఫర్వాలేదనిపించుకున్న శోభిత, నిర్మాతగా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

Goodachari Heroine Starting Production house..:

Goodachari Heroine Starting Production house..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ