Advertisementt

డ్రగ్స్ కేస్: రకుల్ ప్రీత్ సింగ్‌ అరెస్ట్ తప్పదా..?

Sat 12th Sep 2020 09:53 PM
drugs case,sara ali khan,rakul preet singh,simone khambatta,ncb scanner,rakul arrest  డ్రగ్స్ కేస్: రకుల్ ప్రీత్ సింగ్‌ అరెస్ట్ తప్పదా..?
Drugs case: Rakul Preet Singh Name on Board డ్రగ్స్ కేస్: రకుల్ ప్రీత్ సింగ్‌ అరెస్ట్ తప్పదా..?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అని భాషల సినిమా ఇండస్ట్రీస్‌లో ప్రముఖులు డ్రగ్స్ మాఫియా చేతిలో కీలు బొమ్మలుగా మారడమే కాదు.. వారు కూడా డ్రగ్స్ సేవించారనే విషయం సంచలనంగా మారింది. ప్రస్తుతం బాలీవుడ్, శాండిల్ వుడ్ లలో ఈ డ్రగ్స్ విషయంలో కొందరు హీరోయిన్లను అరెస్ట్‌లు కూడా చేశారు. సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య చివరికి డ్రగ్స్ కేసుగా మారి.. పలువురి సినిమా ప్రముఖుల మత్తు దందాని బయటపెట్టేస్తుంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి సుశాంత్ కి డ్రగ్స్ ఇచ్చేదాన్ని అని చెప్పడమే కాదు... బాలీవుడ్‌లో 25 మంది ప్రముఖులు డ్రగ్స్ సేవించేవారని.. రియా ఎంసిబి ఎదుట చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్‌లో సినిమాలు చేసిన సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఈ డ్రగ్స్ విషయంలో బయటికి రావడంతో సౌత్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అలాగే బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్‌తో కేదారనాధ్ సినిమా చేసిన సైఫ్ అలీ ఖాన్ డాటర్ సారా అలీ ఖాన్ కూడా డ్రగ్స్ సేవించేదని రియా ఎంసీబీ విచారణలో చెప్పినట్లుగా ప్రముఖ టైమ్స్ నౌ ఛానెల్ ప్రసారం చేయడం సంచలనంగా మారింది. కన్నడలో రాగిణి ద్వివేది, సంజన అరెస్ట్ అవడం రియా చక్రవర్తి ఈ డ్రగ్స్ కేసులో పలువురు పేర్లు బయట పెట్టడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అంటూ చాలామంది ప్రముఖులు గుండె దడతో భయపడుతున్నారు.

తాజాగా రియా ఎంసీబీ ఎదుట రకుల్, సారా అలీ ఖాన్, సుశాంత్ మరో ఫ్రెండ్, ఇంకో డిజైనర్ పేర్లను డ్రగ్ సేవించే వారంటూ బయట పెట్టినట్లుగా చెప్పడంతో.. ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ రకుల్ అరెస్ట్ కూడా అనివార్యమా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రియా చక్రవర్తి ఇప్పటికే రకుల్, సారా, సైమోన్ కంబట్టా పేర్లని బయటపెట్టింది అని.. విచారణలో ఇంకెన్ని పేర్లు బయటికి వస్తాయో అంటున్నారు. మరి రకుల్ అరెస్ట్ అనివార్యం అయ్యేలా ఉంది అని.. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన రకుల్ కూడా డ్రగ్ ఎడిక్ట్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Drugs case: Rakul Preet Singh Name on Board:

Sara Ali Khan, Rakul Preet Singh, Simone Khambatta under NCB scanner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ