Advertisementt

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు..

Fri 11th Sep 2020 10:20 PM
sajid khan,dimple paula,metoo,bollywood  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు..
model accused sexual harrassment on bollywood director బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు..
Advertisement
Ads by CJ

మీటూ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకి గురైన హీరోయిన్లు ఒక్కొక్కరుగా బయటకి వచ్చి తమకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు. హాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం బాలీవుడ్, టాలీవుడ్ దాకా సాగింది. బాలీవుడ్ లో చాలామంది సెలెబ్రిటీలు ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై ఈ ఆరోపణలు వచ్చాయి. 

ఇద్దరు నటీమణులు సహా ఒక జర్నలిస్ట్ సాజిద్ ఖాన్ పై ఇలాంటి ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో సాజిద్ ఖాన్ ని హౌస్ ఫుల్ సినిమా నుండి తప్పించారని వినబడింది. ఐతే తాజాగా ఈ డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు ఆరోపణలు వస్తున్నాయి. మోడల్ డింపుల్ పాలా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయాలని బయటపెట్టింది. 

హౌస్ ఫుల్ సినిమా సమయంలో సాజిద్ ఖాన్ తనని లైంగికంగా వేధించాడని, అనవసరంగా తాకేవాడని, ఇంకా విపరీత చేష్టలు చేసాడని చెప్పుకొచ్చింది. పదిహేడేళ్ల వయసులో తనకి ఏం చేయాలో తెలియలేదనీ, ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకపోవడం వల్ల ఆ విషయాలని అప్పుడు బయటకి చెప్పలేదని తెలిపింది.ప్రస్తుతం డబ్బు సమస్య తనకేం లేదనీ, ఇంకా తన పేరెంట్స్ తనతో పాటు లేరనీ, అలాంటి వారి వల్ల ఇండస్ట్రీకి రావాలని కలలు కన్న ఇబ్బంది కలుగుతుందని, అందుకే ఇప్పుడు బయటకి వచ్చి చెబుతున్నానని ముగించింది.

model accused sexual harrassment on bollywood director:

model accused sexual harrassment on bollywood director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ