బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడితో సినిమా మొదలుపెట్టాడు. బాహుబలి తర్వాత బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎదురుచూసిన వాళ్లకి ఆదిపురుష్ ప్రకటనతో సమాధానం చెప్పాడు. అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన తానాజీ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ఓం రౌత్, ఆదిపురుష్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.
ఐతే ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో అనేక కథనాలు పుట్టుకొస్తున్నాయి. రామాయణ గాథని త్రీడీలో చూపించబోతున్నందున రాముడిగా ప్రభాస్ కనిపిస్తుంటే రావనాసురుడిగా సైఫ్ ఆలీ ఖాన్ ని చూపిస్తున్నారు. ఐతే సీత పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ విషయమై రోజుకో పేరు వినిపిస్తుంది.
ముందుగా అనుష్క శెట్టి అయితే బాగుంటుందని వినిపించింది. ఆ తర్వాత భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీ సీతగా కనిపిస్తోందని అన్నారు. తాజాగా సీత పాత్రలో అనుష్క శర్మ చేస్తుందని అంటున్నారు. ఐతే ఇవన్నీ ప్రచారంలో ఉన్నవే గానీ అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు. మరి సీత పాత్రలో ఎవరు నటిస్తారో ఎప్పుడు వెలిబుచ్చుతారో చూడాలి. అప్పటికి గానీ ఈ కథనాలు ఆగేలా లేవు.