Advertisementt

రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టుగా ఆహాలోకే.. ఎప్పుడంటే..?

Fri 11th Sep 2020 10:35 AM
orey bujjiga,raj tarun,hebbah patel,malavika nair,anup rubens,vijay kumar konda  రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టుగా ఆహాలోకే.. ఎప్పుడంటే..?
Orey Bujjigaa coming to Aha on.. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా డైరెక్టుగా ఆహాలోకే.. ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

అన్ లాక్ 4.0లో కూడా థియేటర్లు తెరుచుకోలేదు. ఎప్పుడు తెరుచుకుంటాయన్న దానిపై సరైన సమాచారం రావట్లేదు. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులని పలకరిస్తున్నాయి. బాలీవుడ్ లో అయితే పెద్ద పెద్ద చిత్రాలు సైతం ఓటీటీ బాట పట్టాయి. ఐతే ఓటీటీలో డైరెక్టుగా రిలీజ్ అవుతున్న సినిమాలకి సరైన స్పందన రావడం లేదన్నది మెజారిటీ అభిప్రాయం. ఓటీటీలో రిలీజ్ అయిన తెలుగు చిత్రాలకి అంతంత మాత్రంగానే ఆదరణ దక్కింది.

ఐతే ఆహా యాప్ ద్వారా విడుదలైన చిత్రాలకి మిగతా చిత్రాల కంటే మెరుగైన స్పందన వచ్చిందనే చెప్పాలి. భానుమతీ రామక్రిష్ణ మొదలుకుని, క్రిష్ణ అండ్ హిస్ లీల, జోహార్ మొదలగు చిత్రాలకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఐతే తాజాగా ఆహా యాప్ లో మరో తెలుగు చిత్రం సందడి చేయనుంది. రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా ఆహా ద్వారా విడుదల అవనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

హెబ్బా పటేల్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రానికి గుండెజారి గల్లంతయ్యిందే దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. అక్టోబర్ 2వ తేదీ నుండి ఒరేయ్ బుజ్జిగా ఆహాలో అందుబాటులో ఉండనుంది.

Orey Bujjigaa coming to Aha on..:

Orey Bujjigaa coming to Aha on..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ