Advertisementt

అర్జెంట్‌గా ప్రభాస్ ఆ పని చేయాలి

Fri 11th Sep 2020 08:57 PM
prabhas,radhe shyam,craze,radhakrishna kumar,saaho,aadipurush,nag ashwin  అర్జెంట్‌గా ప్రభాస్ ఆ పని చేయాలి
No Craze on Prabhas and Radhakrishna Radhe Shyam అర్జెంట్‌గా ప్రభాస్ ఆ పని చేయాలి
Advertisement
Ads by CJ

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ కాంబోలో రాధేశ్యామ్ అంటూ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్, ఓం రౌత్‌ల పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటించడానికి రెడీగా ఉన్నాడు. అయితే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పై ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రేక్షకుల్లో సినిమాపై కనిపించడం లేదు. కారణం నాగ్ అశ్విన్  మూవీ, ఆదిపురుష్ సినిమాలు లైన్ లోకి రావడమే అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాధేశ్యామ్ మీద ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వడం లేదు. నాగ్ అశ్విన్ - ఆదిపురుష్ సినిమాలో ట్రెండింగ్ లో ఉంటున్నాయి. నాగ్ అశ్విన్ సినిమా న్యూస్ అయినా, లేదా ఆదిపురుష్ సినిమా న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక దర్శకుడు రాధాకృష్ణ పరిస్థితిని గమనించి రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ సూపర్ గా కనిపిస్తాడని, డార్లింగ్ తో పని చెయ్యడం నా కల అని ఏదేదో చెప్పినా జనాలకు ఎక్కడం లేదు. అదే ఆదిపురుష్ హీరోయిన్ పై గాసిప్ అయినా, ఆదిపురుష్ విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద అయినా, ప్రభాస్ రాముడి పాత్రపై రకరకాల న్యూస్ లు మాత్రం ట్రెండ్ అవుతున్నాయి. రాధేశ్యామ్ మూవీకి ఎలా క్రేజ్ తేవాలో ప్రభాస్ ఆలోచించాలి. లేదంటే సాహోకి పట్టిన గతే రాధేశ్యామ్‌కి పడుతుంది అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. మరి రాధేశ్యామ్.. నాగ్ అశ్విన్ చిత్రం - ఓం రౌత్‌ల ఆదిపురుష్ ముందు వెల వెలబోతున్నట్టుగానే కనబడుతుంది.

No Craze on Prabhas and Radhakrishna Radhe Shyam:

Prabhas should concentrate on rectifying the mistakes committed in Saaho

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ