‘‘చాలా సంతోషముగా నా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను....
ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యముగా మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి, వారి కాబినెట్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము....
మా తండ్రిగారి, నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్ర పాఠశాల సిలబళ్ళో చేర్చటం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము.....మేమే కాదు, యావత్ ప్రపంచమంతటా తెలుగు ప్రజలు వారి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గర్వపడుతున్నారు....
అంతటి మహనీయుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబస్‌లో చేర్చి పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశం చేయటం భావితరాలకు తప్పకుండా మార్గదర్శకం ఉంటుంది.
స్వర్గీయనందమూరి తారక రామారావుగారిలో ఉన్న నీతి, నిజాయితీ, కృషి, క్రమశిక్షణా, పట్టుదల, నిబద్ధత ....ఇవన్నీ భావితరాల విద్యార్థులకు ఒక ఊపిరిగా, స్ఫూర్తిగా తీసుకొని పాటిస్తే భవిషత్తులో ఉత్తమ పౌరులుగా తయారు అవుతారని భావిస్తున్నాను.....
మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
మీ......
నందమూరి రామకృష్ణ.