Advertisementt

‘జెంటిల్‌మేన్ 2’.. ప్రకటన వచ్చేసింది

Fri 11th Sep 2020 05:09 PM
kt kunjumon,gentleman2,pan india film,telugu,tamil,hindi,malayalam,kannada  ‘జెంటిల్‌మేన్ 2’.. ప్రకటన వచ్చేసింది
Gentleman2 Movie announced ‘జెంటిల్‌మేన్ 2’.. ప్రకటన వచ్చేసింది
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో  ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా కేటి కుంజుమోన్ ‘జెంటిల్‌మేన్ 2’ 

కథా బలం ఉన్న చిత్రాలను బిగ్ స్కేల్ లో నిర్మించి భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన డేరింగ్ నిర్మాత కే టి కుంజుమోన్ నిర్మాతగా మాస్టర్ డైరెక్ట‌ర్ శంకర్‌ దర్శకత్వం వ‌హించిన మొద‌టి సినిమా జెంటిల్‌మేన్.  తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా హీరో  అర్జున్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.  విద్యావ్యవస్థలోని లోపాలపై పోరాడే ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం నమోదు చేయడమే కాక విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా అందుకున్నది.  అప్ప‌టికే శ‌ర‌త్‌కుమార్ హీరోగా వ‌సంత‌కాల ప‌ర‌వై, సూరీయ‌న్ వంటి బిగ్ బ‌డ్జెట్ మూవీస్ నిర్మించిన మెగా ప్రొడ్యూస‌ర్ కే టి కుంజుమోన్ 1993 లో శంకర్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోగా జెంటిల్‌మేన్ చిత్రాన్ని నిర్మించారు. సంగీత ద‌ర్శ‌కుడు ఏ ఆర్ రెహమాన్ స్వ‌ర‌ప‌రిచిన ఈ మూవీలోని అన్ని పాట‌లు ఇన్‌స్టెంట్ హిట్‌గా నిలిచి దేశ న‌లుమూల‌ల‌కి వినిపించాయి. ఒక చిన్న ప్రేమకథను భారీ స్థాయిలో నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు కుంజుమోన్.

కే టి కుంజుమోన్ ప్రభుదేవాను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన కాదలన్ / ప్రేమికుడు సంచలన విజయం సాధించింది. తెలుగు స్టార్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జునతో కేటి కుంజుమోన్ తమిళ, తెలుగు భాషల్లో మాసివ్ బడ్జెట్ మూవీ రక్షకుడు నిర్మించి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం ద్వారా మిస్ యూనివర్స్ సుస్మిత సేన్‌ను వెండితెరకు పరిచయం చేశారు. ఎంతో మందిని పరిచయం చేయడమే కాకుండా తన చిత్రాల ద్వారా ఎంతో మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులకు బ్రేక్‌ను ఇచ్చారు కే టి కుంజుమోన్. మలయాళం స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ లతో కూడా కుంజుమోన్ చిత్రాలు నిర్మించారు. సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌ల ఎన్నో చిత్రాలతో పాటు కొన్ని వందల చిత్రాలను తమిళ నాడు, కేరళ, మహారాష్ట్రలలో డిస్ట్రిబ్యూట్ చేశారు. తను నిర్మించే చిత్రాలనే కాకుండా డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలకు కూడా భారీ స్థాయిలో పబ్లిసిటీ చేసి తన ప్రత్యేకతను చాటుకునేవారు కే టి కుంజుమోన్.

తన నిర్మాణంలో అపూర్వ విజ‌యాన్ని సాధించిన జెంటిల్‌మేన్‌కు పార్ట్ 2 గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా ‘జెంటిల్‌మేన్ 2’ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు నిర్మాత కే టి కుంజుమోన్. ఈ సంద‌ర్భంగా

భారీ చిత్రాల ప్రొడ్యూస‌ర్ కే టి కుంజుమోన్ మాట్లాడుతూ - ‘‘జెంటిల్‌మేన్ మూవీ తమిళ‌, తెలుగు భాష‌ల‌లో విడుద‌లై భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనువదించ‌బ‌డి అన్ని దేశాల ప్రేక్ష‌కుల ‌నుండి మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. అయితే మ‌రోసారి అంద‌రి అంచ‌నాల‌ను అందుకునేలా  రెండింత‌లు గొప్ప‌ద‌నంలో ‘జెంటిల్‌మేన్ 2’ తెర‌కెక్కిస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో హాలీవుడ్ చిత్రాల‌కు ధీటుగా లేటెస్ట్ ప్రొడక్షన్ టెక్నిక్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.’’ అన్నారు.

ఈ చిత్రాన్ని త‌మిళ‌, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ  ఐదు భాష‌ల‌లో జెంటిల్‌మేన్ ఫిలిం ఇంట‌ర్‌నేష‌న‌ల్ సంస్థ‌ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా  నిర్మిస్తుంది. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్రకటించనున్నారు.

Gentleman2 Movie announced:

KT Kunjumon announced Gentleman2 As A Pan India Film In Telugu, Tamil, Hindi, Malayalam and Kannada Languages

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ