Advertisementt

చెప్పినట్టుగానే కోర్టుకి వెళ్ళిన కొరటాల..

Thu 10th Sep 2020 10:24 PM
koratala shiva,acharya,chiranjeevi,mythri movie makers  చెప్పినట్టుగానే కోర్టుకి వెళ్ళిన కొరటాల..
Koratala filed defamation case on... చెప్పినట్టుగానే కోర్టుకి వెళ్ళిన కొరటాల..
Advertisement
Ads by CJ

సందేశాన్ని కథలో మిళితం చేస్తూ కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించే కొరటాల శివ, ఇప్పటి వరకు నాలుగు చిత్రాలకి దర్శకత్వం వహించాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ప్రస్తుతం తన ఐదవ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్నాడు. ఆచార్య అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఐతే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వార్తల్లో ఉంటూ వస్తోంది. ఆచార్య కథ నాదేనంటూ రాజేష్ మండూరి అనే రచయిత మీడియా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఆచార్య మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర్నుండి మొదలైన ఈ వాదన కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై కొరటాల శివ,  రాజేష్ మండూరి న్యూస్ ఛానెల్ డిబేట్లో పాల్గొన్నారు కూడా. దీంతో ఆచార్య కథ గురించి జరుగుతున్న వాదన జనాల్లోకి వెళ్ళిపోయింది.

ఈ మేరకు కొరటాల శివ, రాజేష్ మండూరి పై పరువు నష్టం దావా వేసాడు.  కథ విషయంలో కోర్టుకి వెళ్తానన్న కొరటాల అన్నంత పనిచేసాడు. అదలా ఉంచితే చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ రాజేష్ మండూరి వాదనలని కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. 

Koratala filed defamation case on...:

Koratala filed defamation case on...

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ