అక్టోబర్ 2న ‘జీ 5’ ఒరిజినల్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’ ప్రీమియర్
గురువారం, 10 సెప్టెంబర్ 2020:
వెబ్ సిరీస్ ప్రారంభం నుండి శుభం కార్డు పడేవరకూ అనుక్షణం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు గురిచేసే బెస్ట్ థ్రిల్లర్‌లను ‘జీ 5’ ఓటీటీ ప్రేక్షకులకు అందించింది. వెబ్ వరల్డ్ వీక్షకులలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల ‘అభయ్’ సీజన్ 2తో వీక్షకులందరూ ఆ సిరీస్ గురించి చర్చించుకునేలా చేసిన ‘జీ 5’, మరో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎక్స్‌పైరీ డేట్’ రిలీజ్ డేట్ ప్రకటించింది. అక్టోబర్ 2న ఆ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేసింది.
స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎక్స్‌పైరీ డేట్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గురువారం ‘జీ 5’ విడుదల చేసింది. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మిస్తోందీ సిరీస్. అక్టోబర్ 2న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
రెండు జంటలు, వాళ్లకు సంబంధించిన వివాహేతర సంబంధాల చుట్టూ సాగే కథతో ‘ఎక్స్‌పైరీ డేట్’ రూపొందింది. కథానాయకుల ప్రవర్తనలో కోపం, అసూయ వల్ల వచ్చిన మార్పులు మోసపూరిత, దుర్మార్గపు స్వభావాన్ని బయటపెడతాయి. అప్పుడు కథను మలుపులు తిరుగుతుంది.
ప్రధాన పాత్రలో నటించిన టోనీ ల్యూక్ మాట్లాడుతూ... ‘‘ఇదొక ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. రొమాన్స్, రివెంజ్, మనిషి పంతాలు పట్టింపులు, మోసం... కథలో చాలా ఉన్నాయి. పాత్రల్లో కూడా వివిధ షేడ్స్ ఉంటాయి. అవి కథనాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి. ఆసక్తికరమైన మలుపులతో సిరీస్ సాగుతుంది. ‘జీ 5’ ఈ షోకి గ్లోబల్ రీచ్ ఇస్తోంది. ప్రజలకు ఈ షో నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
ఈ షోతో డిజిటల్ వరల్డ్‌లో అడుగుపెడుతున్న స్నేహ ఉల్లాల్ మాట్లాడుతూ... ‘‘జీ5 ఒరిజినల్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’ తో డిజిటల్ అరంగేట్రం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో నేనూ పార్ట్ అవ్వడం ఎగ్జయిటింగ్ గా ఉంది. ప్రతి ఎపిసోడ్‌లో వీక్షకులు సస్పెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. నా పాత్ర ఇతరులను డామినేటింగ్ చేసేలా, ఆర్డర్లు ఇచ్చేలా ఉంటుంది. తప్పకుండా ఇతరులను ఇబ్బందిపెడుతుంది’’ అని అన్నారు.
ప్రేమ, నమ్మకం, మోసం, ప్రతీకారంతో ముడిపడిన కథాంశంతో ప్రతి ఎపిసోడ్‌లో ప్రేక్షకులు ఊహించని మలుపులతో సీట్ చివర కూర్చుని ఉత్కంఠగా చూసేలా ఈ సిరీస్ ఉంటుందని దర్శకుడు శంకర్ కె. మార్తాండ్ తెలిపారు. మొత్తం పది ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ అక్టోబర్ 2న ‘జీ 5’ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.