Advertisementt

అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..

Thu 10th Sep 2020 11:00 AM
allu arjun,icon,venu sriram,dil raju  అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..
Director given clarity about Allu Arjuns Icon అల్లు అర్జున్ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుందని ప్రకటించారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఐకాన్ పట్టాలెక్కుతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ సడెన్ గా సుకుమార్ పుష్ప ఆ స్థానంలోకి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పనుల్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపిస్తుంది.

పుష్ప పూర్తయ్యాక ఐకాన్ ఉండబోతుందని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్, కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు. పుష్ప తర్వాత ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఐకాన్ చిత్రాన్ని అల్లుజ్ అర్జున్ పక్కన పెట్టేసాడని, అందుకే కొరటాల శివతో సినిమా ప్లాన్ చేసాడని అన్నారు. తాజా సమాచారం ప్రకారం ఐకాన్ సినిమా ఆగిపోలేదని తెలుస్తుంది.

దర్శకుడు వేణు శ్రీరామ్ ఐకాన్ చిత్ర విషయమై అల్లు అర్జున్ తో టచ్ లో ఉంటున్నాడట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని రూపొందిస్తున్న వేణు శ్రీరామ్, ఐకాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. అల్లు అర్జున్ కమిట్మెంట్లు పూర్తయ్యాక ఈ చిత్రం పట్టాలెక్కనుందట. ఐకాన్ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Director given clarity about Allu Arjuns Icon:

Director given clarity about Allu Arjuns Icon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ