హీరోలంతా ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో అభిమానులకి కిక్ ఇస్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం గత ఐదునెలలుగా అభిమానులకు కనిపించిన పాపన పోలేదు. కరోనా టైం లో ఎంత ఇంటి పట్టున ఎంజాయ్ చేస్తుంటే మాత్రం.. కనీసం సోషల్ మీడియాలో అయినా అభిమానులకు దర్శనమిస్తే అది అభిమానులకు హ్యాపీ. కానీ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేయడం తప్ప మనిషి మాత్రం కనిపించడం లేదు. చరణ్ అయినా అక్కడక్కడా వీడియోస్‌తోనో ఫొటోస్‌తోనో సందడి చేసాడు. ఇక అల్లు అర్జున్ వాకింగ్ తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి షాకిస్తున్నాడు. ఆఖరుకి ప్రభాస్ కూడా జనాల్లోకి వస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం అబ్బో చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు.
అయితే ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్‌తో ఓ మూవీ, అలాగే ప్రశాంత్ నీల్‌తో మరో మూవీ చేయబోతున్నాడు. త్రివిక్రమ్‌తో అయితే పక్కా కానీ ప్రశాంత్ నీల్ తో క్లారిటీ రావడం లేదు. ఈలోపు ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ విషయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. RRR పాన్ ఇండియా మూవీతో బాలీవుడ్‌కి వెళుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తర్వాత స్ట్రయిట్ బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడని.. అది కూడా స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో చేయబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కనున్న చిత్రంలో ఎన్టీఆర్ కిక్ బాక్సర్‌గా కనిపిస్తాడని ప్రచారము జరుగుతుంది. మరి ఎన్టీఆర్ నిజంగా బాలీవుడ్ స్ట్రయిట్ ఫిలిం కోసం ప్లాన్ చేస్తున్నాడా? అది నిజమా? అంటుంటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నిజమే.. నమ్మాలి అంటున్నారు.