సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ప్రకటించడానికి ఐదునెలల సమయం తీసుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. సినిమా ప్రకటన అయితే జరిగింది గానీ షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారనేది మాత్రం ఇంకా వెల్లడి చేయలేదు. కరోనా కారణంగా ఇప్పట్లో చిత్రీకరణ జరపవద్దని భావిస్తున్నారట.
ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు, షూటింగ్ కోసం బయటకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. యాడ్ షూట్ కోసం సెట్లో కనిపించిన మహేష్ బాబు లుక్ బయటకి వచ్చింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. షూటింగ్ ప్యాకప్ చేసిన తర్వాత ఈ షాట్ తీసానని చెప్పుకొచ్చాడు. కరోనా బ్రేక్ తర్వాత మహేష్ లుక్ చాలా మారిపోయింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.
హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. చూస్తుంటే సర్కారు వారి పాట సినిమా కోసం లుక్ ఛేంజ్ చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సర్కారు వారి పాట సినిమాలో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. మొత్తానికి కరోనా బ్రేక్ తర్వాత మహేష్ చాలా మారిపోయాడు.