బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సింహా, లెజెండ్ చిత్రాలు బాలయ్య కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలుగా నిలిచిపోయాయి. సింహా కి ముందు బాలయ్య ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆ ఫ్లాపులన్నీ సింహ గర్జనకి పక్కకి తప్పిపోయాయి. ఐతే ప్రస్తుతం బాలయ్య మళ్లీ ఫ్లాపుల్లోకి దిగాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి.
ఐతే రూలర్ తర్వాత బాలయ్య, బోయపాటితో సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం ఇది. ఈ సినిమా బాలయ్యని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని నమ్ముతున్నారు. టీజర్ కి మంచి స్పందన వచ్చింది కూడా. ఐతే ఈ సినిమాలో బాలయ్య పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. మరి ఆ పవర్ ఫుల్ పాత్రకి విలన్ గా ఎవరు కనిపించనున్నారనేది ఆసక్తిగా మారింది.
తాజా సమాచారం ప్రకారం బోయపాటి, బాలీవుడ్ నటుడు సోనూసూద్ ని బాలయ్య విలన్ గా తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు బోయపాటి స్క్రిప్ట్ వినిపించాడని టాక్. సోనూసూద్ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నాడట. ఇటీవల కరోనా కాలంలో సోనూసూద్ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. మరి ఆ పాపులర్ నటుడు బాలయ్య- బోయపాటి సినిమాలో విలన్ గా కనిపిస్తాడో లేదో చూడాలి.