Advertisementt

పవన్ కంటే ముందు అఖిల్‌తో అంటున్నారు

Wed 09th Sep 2020 08:23 PM
akhil,pawan kalyan,surender reddy,next movie,update  పవన్ కంటే ముందు అఖిల్‌తో అంటున్నారు
Surender Reddy and Akhil Combo Film Update పవన్ కంటే ముందు అఖిల్‌తో అంటున్నారు
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్ ప్లాప్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత అఖిల్ సినిమా విషయంలో చాలా ఊహాగానాలే నడిచాయి. అందులో ముఖ్యంగా సైరా దర్శకుడు సురేందర్ రెడ్డితో అఖిల్ నెక్స్ట్ అంటూ ప్రచారం జరిగింది కానీ ప్రకటన రాలేదు. నాగార్జున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలయ్యాకే అఖిల్ నెక్స్ట్ డైరెక్టర్ విషయంలో ఓ క్లారిటీకి రావాలని అనుకునే లోపు సురేందర్ రెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మూవీ చెయ్యడానికి రంగం సిద్ధం చేసేసాడు. పవన్ కళ్యాణ్‌తో ఒప్పందం.. పవన్ పుట్టినరోజు నాడు ఆ సినిమాపై ప్రకటన అన్ని జరిగిపోయాయి. దానితో అఖిల్ అభిమానులు కాస్త కలవరపడ్డారు.

అయితే సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా ఉంటుంది అని అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా కన్నా ముందే అంటూ ప్రచారం జరుగుతుంది. అంటే పవన్ వకీల్‌సాబ్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినా.. తాజాగా క్రిష్ సినిమా అలాగే హరీష్ శంకర్ తో చెయ్యబోయే సినిమాలు పూర్తయ్యాకే సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది. కాబట్టి ఈ లోపు సురేందర్ రెడ్డి అఖిల్‌తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఎలాగూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ షూటింగ్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. సో ఆ సినిమా విడుదల కాగానే సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా చేస్తాడని అంటున్నారు.

Surender Reddy and Akhil Combo Film Update:

First Akhil, Next Pawan Kalyan for Surender Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ