Advertisementt

వి సక్సెస్‌పై స్పందించిన నాని

Wed 09th Sep 2020 12:44 AM
hero nani,v movie,reaction,success  వి సక్సెస్‌పై స్పందించిన నాని
Nani reaction on V movie success వి సక్సెస్‌పై స్పందించిన నాని
Advertisement
Ads by CJ

నా 25వ సినిమా ‘వి’పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు - హీరో నాని

నాని, సుధీర్ బాబు నటించిన వి సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదల ఆయిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా నాని పాత్రకు వస్తోన్న ప్రసంశలు చూస్తుంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో తెలుసుకోవచ్చు. 

తన అభిమానులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు ఈ సందర్భంగా నాని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 12 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను ఊహించలేదు ఇప్పుడు నాపై ఇంతటి ప్రేమ, ఆదరణ లభిస్తుందని నాని తెలిపారు. 

మొదటిసారి ఒక నెగిటీవ్ పాత్ర చేసినప్పటికి అభిమానులు నన్ను ఎంతగానో ఆదరించారు. నా 25వ సినిమాపై ఇంతటి అభిమానం చూపించిన అందరికి కృతజ్ఞతలు. నా సినిమా విడుదలైతే థియేటర్స్ దగ్గరికి ఆడియన్స్ రావడం జరుగుతుంది. కానీ ఈసారి నేను మా వి టీమ్ మొత్తం మీ ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఈ పాత్ర ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి అలాగే నా తోటి నటులు సుధీర్ బాబుకు, నివేదా థామస్, అతిథి రావ్ హైదరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా వి సినిమాను విడుదల చేసిన అమెజాన్ ప్రైమ్ వారికి థాంక్స్ తెలుపుతున్నాను. 

ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన నాని, సుధీర్ బాబు వి సినిమా నాని కెరీర్ లో 25వ సినిమాగా రావడం విశేషం. అలాగే డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో నాని చేసిన మూడో సినిమా ఇది. నాని మొదటి సినిమా అష్టా చమ్మ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై 12 ఏళ్ళు అవ్వడం తిరిగి నాని, ఇంద్రగంటి వి సినిమా కోసం వర్క్ చెయ్యడం విశేషం.

న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నివేదా థామస్, అతిథి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటించిన వి సినిమాకు ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

Nani reaction on V movie success:

Nani Happy with V movie success

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ