హరితహారం పేరుతో తెలంగాణలో అడవులని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలెబ్రిటీలని అందులో భాగం చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా మొక్కలు నాటాలన్న ఛాలెంజిని వైరల్ చేసింది.
ఈ నేపథ్యంలో నేషనల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజిని మొదలెట్టిన సంగతి తెలిసిందే. తాజగా ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ మరో గొప్ప కార్యక్రమానికి దారి తీసాడు. అడవులని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ మేరకు అడవిని దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని జిన్నారం మండల పరిధిలో ఉన్న 1650 ఎకరాల అడవి ప్రాంతాన్ని పచ్చగా మార్చేందుకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడు. మున్ముందు మరిన్ని పనులు చేయడానికి సిద్ధం అవుతున్నాడట.