Advertisementt

బిగ్‌బాస్-4 షోలో మొదటి రోజే ట్విస్ట్‌లు..!

Mon 07th Sep 2020 02:07 PM
boss 4 telugu,day - 1 highlights,16 contestants list,star maa,akkineni nagarjuna,gangavva,karate kalyani  బిగ్‌బాస్-4 షోలో మొదటి రోజే ట్విస్ట్‌లు..!
Bigg Boss-4 First Day Twists..! బిగ్‌బాస్-4 షోలో మొదటి రోజే ట్విస్ట్‌లు..!
Advertisement
Ads by CJ

తెలుగు టీవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. సెప్టెంబర్ 6న ఆరుగంటలకు షోను అక్కినేని నాగార్జున గ్రాండ్‌గా ప్రారంభించారు.  అద్భుతమైన వ్యాఖ్యానం, ఆసక్తికరమైన ఏవీలు, పెర్ఫార్మెన్స్‌లతో ఒక్కో కంటెస్టెంట్‌ ఎంట్రీతో అదరగొట్టేశారు. ఈ సందర్భంగా కంటెస్టెంట్లపై నాగ్ ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఎవరెవరు..!?

తొలి కంటెస్టెంట్‌గా ‘సరిలేరు నీకెవ్వరూ’లో స్పెషల్ సాంగ్‌తో ‘సుడిగాడు’ ఫేమ్ గుజరాతి భామ ‘మొనాల్ గజ్జర్’ ఎంట్రీ ఇచ్చింది. రెండో కంటెస్టెంట్‌గా డైరెక్టర్ ‘సూర్యకిరణ్’ అదిరిపోయే ఏవీతో ఎంట్రీ ఇచ్చేశారు. మూడో కంటెస్టెంట్‌‌గా యాంకర్ ‘లాస్య’ అద్భుతమైన ఏవీతో లాస్య ఎంట్రీ ఇచ్చేసింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో అభిజిత్‌ ఓ అద్భుతమైన ఫెర్మార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ ‘సుజాత’.. ఏవీలో తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో ఆరో కంటెస్టెంట్‌గా దిల్ సే ‘మెహబూబ్’ ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో ఏడో కంటెస్టెంట్‌గా టీవీ9 జర్నలిస్ట్ ‘దేవి నాగవల్లి’ ఎంట్రీ ఇచ్చింది. ఎనిమిదో కంటెస్టెంట్‌గా యూట్యూబ్ స్టార్ ‘దేత్తడి హారిక’ ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదో కంటెస్టెంట్‌గా ‘సయ్యద్ సోహైల్’, పదో కంటెస్టెంట్‌గా ‘అరియానా గ్లోరీ’ ఎంట్రీ ఇచ్చారు. ఆర్టిస్ట్ ‘కరాటే కల్యాణి’ 12వ కంటెస్టెంట్‌గా.. ర్యాప్‌తో ఎంట్రీ ఇచ్చిన 13వ కంటెస్టెంట్‌గా సింగర్ నోయెల్ ఎంట్రీ ఇచ్చేశారు. 14వ కంటెస్టెంట్ ‘దివి’ నాగ్ నటించిన ‘ఊపిరి’ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌తో ఎంట్రీ ఇవ్వగా.. 15వ కంటెస్టెంట్‌గా ‘అఖిల్ సార్థిక్’ ఎంట్రీ ఇచ్చారు. ఇక చివరగా మై విలేజ్ షోతో పాపులర్ అయిన తెలంగాణ ‘గంగవ్వ’ 16వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

>నిజంగానే ‘నెవర్ బిఫోర్’!

ఇలా షో ప్రారంభమైన రోజే ‘సయ్యద్ సోహైల్’, ‘అరియానా గ్లోరీ’ని సీక్రెట్ రూమ్‌లోకి పంపారు నాగ్. దీంతో ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ నుంచే గేమ్ స్టార్ట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇలా తొలిరోజే.. అది కూడా కంటెస్టెంట్స్ ఎవరనేది పూర్తిగా తెలియక మునుపే ఇలా సీక్రెట్ రూమ్‌లోకి పంపడం సమ్‌థింగ్.. సమ్‌థింగ్‌గా ఉంది. మొత్తానికి చూస్తే.. ఈ షో ప్రారంభమైన తొలిరోజే బిగ్‌బాస్ నిర్వాహకులు అదిరిపోయే ట్విస్ట్‌లు ఇచ్చారు. ఈ సీజన్ మొదలవుతుందన్నప్పటి నుంచి ప్రోమోలు ఓ రేంజ్‌లో వస్తుంటే విషయం ఉంటుందో ఉండదో అని అందరూ అనుకున్నారు కానీ.. షో ప్రారంభం రోజు చూసిన తర్వాత మాత్రం నిజంగానే ‘నెవర్ బిఫోర్’ అనిపించింది. ఇదివరకు జరిగిన మూడు సీజన్లతో పోలిస్తే 4వ సీజన్‌కు బిగ్‌బాస్ హౌస్‌ను అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ప్రతి గదినీ అందంగా సుందరంగా అలకరించి వావ్ అనిపించారు. మరీ ముఖ్యంగా ఓ మంచి పాజిటివిటీ అనేది కంటెస్టెంట్లలో నింపేలా హౌస్‌లో వాతావరణం ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు.

Bigg Boss-4 First Day Twists..!:

Bigg Boss-4 First Day Twists..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ