Advertisementt

సర్కారు వారి పాట ప్లాన్ మారిందా..?

Sun 06th Sep 2020 07:56 PM
sarkaru vari paata,mahesh babu,parashuram,thaman  సర్కారు వారి పాట ప్లాన్ మారిందా..?
Sarkaru Vaari Paata Plans changed..? సర్కారు వారి పాట ప్లాన్ మారిందా..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ప్రీ లుక్ పోస్టర్ కి మంచి స్పందన రావడంతో సినిమా కథపై అనేక కథనాలు బయటకి వచ్చాయి. బ్యాంకు మోసాల నేపథ్యంలో రూపొందనుందని వినిపిస్తున్నప్పటికీ మాస్ జనాలకి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయట.

ఐతే ఈ సినిమాని ముందుగా తెలుగులోనే ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుతం తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలని తెరకెక్కించడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, సర్కారు వారి పాట ని పాన్ ఇండియా రేంజ్ లో రూపొందించాలని భావిస్తున్నారట.

అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో పాటు మహేష్ బాబుకి ఉన్న పాపులారిటీ కారణంగా పాన్ ఇండియా వైడ్ గా మంచి ప్రభావం చూపించనుందని అనుకుంటున్నారట. సో.. సర్కారు వారి పాట ని ఇతర భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. ఈ విషయమై ఇప్పటికైతే అధికారిక సమాచారం రాలేదు. ఒకవేళ నిజమైతే మహేష్ అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.

Sarkaru Vaari Paata Plans changed..?:

Sarkaru Vaari Paata Plans changed..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ