కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల తర్వాత సౌత్ వైపు చూడకుండా బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వరస హిట్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లోకెక్కింది. అయితే కియారా అద్వానీ పేరు టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలు మొదలు కాగానే వారితో కియారా నటిస్తుంది అంటూ గాసిప్స్ వస్తున్నప్పటికీ కియారా సౌత్ సినిమాలపై క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది. అయితే తాజగా కియారా సౌత్ లో నటించే విషయమై నోరు విప్పింది.
కియారాని ఓ అభిమాని మీరు సౌత్‌లో నటిస్తే చూడాలని ఉంది అని, మరిన్ని సౌత్ సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని అడగగానే కియారా అద్వానీ వెంటనే రిప్లై ఇచ్చింది. మీ కోరిక తీరుతుంది. త్వరలోనే నన్ను సౌత్ సినిమాల్లో చూస్తారు అని చెప్పింది కానీ.. అది ఏ సినిమా, ఏ హీరోతో కలిసి నటిస్తుందో అనేది రివీల్ చెయ్యలేదు. అంటే కియారా చెప్పిన సమాధానాన్ని బట్టి కియారా అద్వానీ ఏదో ఒక సౌత్ సినిమాకి సైన్ చేసి ఉండాలి. లేదంటే సంప్రదింపులు అయినా జరుగుతుండాలి. మరి సీక్రెట్ అయితే విప్పింది కానీ.. క్లారిటీ ఇవ్వకుండా అందరిని కన్ఫ్యూజన్‌లో పడేసింది.