Advertisementt

సుధీర్ బాబు నిజంగా చాలా గ్రేట్!!

Sun 06th Sep 2020 07:35 PM
sudheer babu,recovery,knee injury,v movie,greatness  సుధీర్ బాబు నిజంగా చాలా గ్రేట్!!
Sudheer Babu Greatness Revealed సుధీర్ బాబు నిజంగా చాలా గ్రేట్!!
Advertisement
Ads by CJ

హీరో సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన ఇన్ స్పైరింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే వి సినిమా షూటింగ్‌కు కొద్ది రోజుల ముందే సుధీర్ బాబు మోకాలు గాయంతో బాధపడ్డారు. మోకాలుకు అనేక ఫిజియోథెరపీల అనంతరం కోలుకున్నారు. ఈ క్రమంలో ఎంతో నొప్పి భరించారు. అలా తన మోకాలు బలాన్ని పెంచుకున్నారు. ఈ ప్రాసెస్ అంతటినీ వీడియోగా చేసి శనివారం తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా రిలీజ్ చేశారు సుధీర్ బాబు.

ఈ వీడియోలో సుధీర్ బాబు మాట్లాడుతూ...నేను ఎంత కష్టాన్ని అనుభవించానో చెప్పేందుకు ఈ వీడియో రిలీజ్ చేయడం లేదు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారికి స్ఫూర్తి కలిగించేందుకు ఈ వీడియోతో ప్రయత్నిస్తున్నా. కష్టమొస్తే చీకట్లో ఉండొద్దు. వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేయండి. వి సినిమాకు కొన్ని నెలల ముందు నా మోకాలుకు గాయమైంది. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. నొప్పిని తట్టుకుంటూ నడిచేందుకు ప్రయత్నించా, వ్యాయామాలు చేశాను. ఆ నొప్పి భరించడాన్ని ఎంజాయ్ చేశాను. నా మోటివేషన్ నా సినిమా, నా ప్రేక్షకులు. అని అన్నారు.

Sudheer Babu Greatness Revealed:

Sudheer Babu’s recovery from knee injury for V Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ