Advertisementt

ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్ అసంతృప్తిగా ఉన్నారా..?

Sat 05th Sep 2020 11:07 AM
prabhas,sai ali khan,om raut,telugu,bollywood  ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్ అసంతృప్తిగా ఉన్నారా..?
Prabhas Fans not accepting him as.. ఆ విషయంలో ప్రభాస్ ఫ్యాన్ అసంతృప్తిగా ఉన్నారా..?
Advertisement
Ads by CJ

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఐతే సడెన్ గా ప్రకటించిన ఆదిపురుష్ చిత్రం అందరినీ ఆకర్షించింది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రామాయణ గాథని త్రీడిలో చూపించబోతున్నందున ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఐతే ప్రభాస్ రాముడిగా చేస్తున్నాడు సరే, మరి సీతగా ఎవరు.. రావణుడిగా ఎవరు చేస్తున్నారనే విషయమై అనేక కథనాలు వచ్చాయి.

తాజాగా ఆదిపురుష్ టీమ్ రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ చేస్తున్నాడని ప్రకటించింది. ఏడు వేల సంవత్సరాల క్రితం జీవించబడ్డ అత్యంత తెలివైన రాక్షసుడిగా ఈ పాత్రని పరిచయం చేసింది. ఈ పాత్ర పేరు లంకేష్ అని తెలిపింది. ఐతే విలన్ గా సైఫ్ ఆలీఖాన్ చేయడం చాలా మంది ప్రభాస్ అభిమానులకి అసంతృప్తికి గురి చేసింది.

తెలుగు అభిమానులకైతే సైఫ్ పెద్దగా పరిచయం లేదు. అదీగాక రావణుడిగా సైఫ్ సెట్ అవ్వడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు బాలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఏదైమైనా ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పుడు కనిపించిన ఎక్సైట్ మెంట్ విలన్ ని పరిచయం చేసినపుడు కనిపించలేదంటే అభిమానులు ఎలా స్పందిస్తున్నారో అర్థం అవుతుంది.

Prabhas Fans not accepting him as..:

Prabhas Fans not accepting him as..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ