Advertisementt

కలర్ ఫోటో ఆహాలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Sat 05th Sep 2020 10:39 AM
colour photo,suhas,chandini choudary,sunil,sai rajesh neelam,aha  కలర్ ఫోటో ఆహాలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?
Colour Photo Will Streaming on.. కలర్ ఫోటో ఆహాలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

చిన్న చిన్న లఘు చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించిన యాక్టర్ సుహాస్, కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారుతున్నాడు. సందీప్ రాజ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇటీవలే చిత్ర షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. చాందినీ చౌదరి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికీ సినిమా మీద మంచి నమ్మకం కలిగింది.

కమెడియన్ సునీల్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. టీజర్ లో విలనిజం బాగా కనిపించింది. విలన్ గా సునీల్ కి మంచి పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నారు. ఐతే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడి ఉండడంతో ఓటీటీ వేదిక ద్వరా విడుదల అవనుంది.

ఈ మేరకు ఆహా యాప్ తో చర్చలు జరిగాయని సమాచారం. అల్లు అరవింద్ ఈ సినిమాని ఆహా యాప్ కోసం కొనుక్కున్నాడని టాక్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నందున దీపావళి కానుకగా ఆహాలో రిలీజ్ చేస్తారట. ఈ విషయమై అధికారిక సమాచారం ఎప్పుడు వస్తుందో చూడాలి. హృదయ కాలేయం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం, కలర్ ఫోటో చిత్రానికి కథ అందించారు. అంతే కాదు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Colour Photo Will Streaming on..:

Colour Photo Will Streaming on..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ