ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ కోసం బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకొనే తీసుకురావడం నిజంగా నాగ్ అశ్విన్ - ప్రభాస్‌లకు గ్రేటనే చెప్పాలి. ప్రభాస్ క్రేజ్ ఎంత ఉన్నా సౌత్ హీరోతో బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నటించడమనేది నిజంగా సంతోషించవలసిన విషయమే. అయితే దీపికా పదుకొనేని భారీ పారితోషకానికి అశ్విన్ దత్, నాగ్ అశ్విన్‌లు ఒప్పించారని, కాదు దీపికా రోల్ సినిమాలో అతి ముఖ్యం గనుకనే దీపికా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఒప్పుకుంది అని.. భారీగా అడ్వాన్స్ ఇచ్చి మరీ దీపికాని నాగ అశ్విన్ బ్యాచ్ లాక్ చేసింది అని అన్నారు. మరి దీపికా పదుకొనే నాగ్ అశ్విన్ మూవీ మహానటిని చూసి మెచ్చుకోవడం కూడా దీపికా నాగ్ అశ్విన్ మీద నమ్మకంతోనే చేసింది అని చెప్పాలి. అయితే తాజాగా ప్రభాస్ 21లో దీపికా పదుకొనే పై ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో షేకవుతుంది. అది వైజయంతి మూవీస్ ప్రభాస్ 21 మూవీ కోసం ఇచ్చిన అడ్వాన్స్ ని దీపికా పదుకొనే వెనక్కి ఇచ్చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే దీపికా అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసింది అంటే.. నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమా చెయ్యడం లేదేమో అనే భయంతో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు. కానీ దీపికా పదుకొనే అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసింది.. సినిమా మొదలయ్యాకే అశ్విని దత్ దగ్గరనుండి అడ్వాన్స్ తీసుకోవాలని, ఎలాగూ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కాబట్టి సినిమా మొదలయ్యాక అడ్వాన్స్ అందుకుందామని అనుకుంటుందట. అలాగే దీపికా పదుకొనే మరో ఆలోచన ఏమిటంటే.. నాగ్ అశ్విన్ - ప్రభాస్ మూవీ కాస్త లేట్ అయ్యేటట్లుగా ఉందని, ప్రభాస్ రాధేశ్యామ్ అవ్వాలి, తర్వాత అనూహ్యంగా ఆదిపురుష్ లైన్‌లోకొచ్చినా.. నాగ అశ్విన్ సినిమా పూర్తయ్యాకే ఆదిపురుష్ ఉంటుంది అనుకుంటే.. ఓంరౌత్ ఆదిపురుష్ నాగ అశ్విన్ కన్నా ముందే మొదలెట్టే సూచనలు ఇవ్వడంతో.. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ లేటవుతుంది. అందుకే అడ్వాన్స్ ఇచ్చేస్తే.. నిర్మాతలకు భారం పడకుండా ఉంటుంది.. సినిమా మొదలయ్యాకే అడ్వాన్స్ పుచ్చుకోవచ్చని దీపికా ఆలోచనగా చెబుతున్నారు.