సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఆసక్తిగా మారింది. ఎఫ్ 2 సినిమా విజయవంతం అయ్యాక ఎఫ్ 3 ఉంటుందని ప్రకటించిన అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా స్క్రిప్టు తయారు చేయడానికి వినియోగించాడు. ఇప్పుడు స్క్రిప్టు పూర్తిగా సిద్ధమైంది. అటు హీరోయిన్లు కూడా కథ విని ఓకే అన్నారట.
తమన్నా, మెహ్రీన్.. ఇద్దరూ ఎఫ్ 3 చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే హీరోలే ఆలస్యం చేస్తున్నారని టాక్. అటు నారప్ప సినిమాతో వెంకటేష్, ఇటు బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమాతో వరుణ్ బిజీగా ఉన్నారు. ఐతే ఈ రెండు చిత్రాలు కూడా ఇప్పుడు షూటింగ్ జరుపుకోవట్లేదు. కరోనా కారణంగా మరికొన్ని రోజుల దాకా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు.
అటు పక్క అనిల్ రావిపూడి ఇద్దరు హీరోల కోసం ఎదురుచూస్తున్నాడు. వన్స్ తమ సినిమాలని ముగించుకుని రాగానే ఎఫ్ 3ని మొదలెడతాడట. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా పెద్ద పెద్ద చిత్రాలు సైతం షూటింగ్ రీస్తార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకీ, వరుణ్ లు తమ సినిమా షూటింగులని మొదలు పెడతారో లేదో చూడాలి.