హితైషులకు నమస్సులు,
సెప్టెంబర్ 2... నా జన్మదినం సందర్భంగా సినీ, మీడియా మిత్రులెందరో సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సినిమా ఇంచార్జెస్, విలేకర్లు, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, వెబ్ మీడియా నిర్వాహకులు, పాత్రికేయులు ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ చెప్పారు. అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
నా సినీ ప్రస్థానం... మైలురాళ్ళను ప్రస్తావిస్తూ సాగిన వ్యాసాలు, కథనాలు, రాబోతున్న చిత్రాల వివరాలను పాఠకులకు, వీక్షకులకు తెలియచేయడం నన్నెంతో సంతోషపరచింది. ఒకసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు.
కష్టాల్లో ఉన్న జనం గళంగా జనసేన నిలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. సినీ రంగంలో భాగమైన మీడియా మిత్రులు – నేను ప్రజా జీవితంలో ఉన్నా తమవాడిగా భావించి నా అభిమానులకు, సినీప్రియులకు కనువిందు చేశారు.
నా హితైషులైన సినీ పాత్రికేయులందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటూ...
మీ
పవన్ కల్యాణ్