Advertisementt

వి సినిమాకి పట్టుకున్న భయం అదే...

Fri 04th Sep 2020 02:29 PM
nani,v the movie,sudheer babu,indraganti mohanakrishna,aditi rao hydari,nivetha thomas,amazon prime  వి సినిమాకి పట్టుకున్న భయం అదే...
Big Threat for V Movie.. వి సినిమాకి పట్టుకున్న భయం అదే...
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన సినిమా.. వి. సుధీర్ బాబు మరో హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించారు. కరోనా వల్ల థియేటర్లు తెరుచుకోనందున ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. రేపటి నుండి ఈ సినిమా అమెజాన్ లో అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో వి సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. అటు అమెజాన్ తో పాటు చిత్ర బృందం బాగానే కృషి చేస్తుంది.

పెద్ద పెద్ద చిత్రాలని తమ చేతుల్లోనే ఉంచుకుని ఓటీటీలో రిలీజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నవారు వి సినిమాకి వచ్చే రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో వి సినిమా విజయం అందుకుంటే తమ చిత్రాలని సైతం విడుదల చేయాలని చూస్తున్నారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతున్న పెద్ద సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి బాగానే ఉంది. ఐతే అంతా బాగానే ఉంది గానీ ఒక్క విషయమే వి సినిమాని బాగా భయపెడుతుంది.

పైరసీ.. అవును. ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలకి పైరసీ పెద్ద భూతంలా తయారైంది. ఓటీటీలోకి వచ్చిన రెండు మూడు గంటల్లోనే పైరసీ సైట్లలో దర్శనమిస్తున్నాయి. దాంతో సబ్ స్క్రిప్షన్ వైపు వెళ్ళకుండా పైరసీ చూసేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ కి ఈ భయమే పట్టుకుంది. వి సినిమాని పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొన్నారు. ఇలాంటి టైమ్ లో సబ్ స్క్రిప్షన్స్ పెరిగితేనే వి సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందనేది తెలుస్తుంది. లేదంటే భవిష్యత్తులో ఏ సినిమాకీ పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే సాహసం చేయకపోవచ్చు. చూడాలి మరేం జరగనుందో.

Big Threat for V Movie..:

Big Threat for V Movie..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ