బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న హీరో.. విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాకి తెలుగులో మంచి ఆదరణ దక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్ళని సాధించింది. ఐతే ఈ సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ ప్రతీ సినిమా తెలుగులోకి అనువాదం అవుతోంది. కాకపోతే బిచ్చగాడు సినిమా వచ్చిన రెస్పాన్స్ మరే సినిమాకి రాలేదు.
ప్రస్తుతం విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. బిచ్చగాడు లాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులని బాగా అలరిస్తుందని నమ్ముతున్నాడు. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతున్న ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా ఐదు నెలలుగా అలాగే నిలిచిపోయింది. ఐతే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా షూటింగ్స్ మొదలుపెడుతున్నారు.
అందువల్ల విజయ్ ఆంటోనీ కూడా బిచ్చగాడు షూటింగ్ రీస్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నాడు. తెలుగు వారికోసం తెలుగులో ట్వీట్ చేసిన విజయ్ ఆంటోనీ, నన్ను నమ్ముకున్న నిర్మాత దర్శక మరియు సినీ కార్మిక సోదరుల శ్రేయస్సున్నిఆకాంక్షిస్తూ ...నేను రేపటి నుండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాను..... అంతా మంచే జరుగుతుందని ఆశిస్తూ...నేను....మీ విజయ ఆంటోని అంటూ పోస్ట్ పెట్టాడు. తమిళ హీరో తెలుగులో పోస్ట్ పెట్టడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.