అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరుసగా రికార్డులు నెలకొల్పుతూనే ఉంది. అటు కలెక్షన్ల పరంగా తెలుగు సినిమా చరిత్రలో నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. ఇంకా సినిమా మ్యూజిక్ బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా రికార్డులు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే వన్ బిలియన్ వ్యూస్ అందుకున్న ఆల్బమ్ గా చరిత్ర సృష్టించింది.
అంతే కాదు ఇటు ఒక్కో సాంగ్ కి సైతం రికార్డు లెవెల్లో వ్యూస్ వస్తున్నాయి. సామజవరగమనా మొదలుకుని, రాములో రాములో, బుట్టబొమ్మ పాటలు ఇంకా ట్రెండింగ్ లో ఉండటం విశేషం. తాజాగా రాములో రాములా పాట సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ పాట లిరికల్ వెర్షన్ కి 200 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
అలాగే వీడియో సాంగ్ కి సైతం 200వ్యూస్ వచ్చి చేరాయి. ఒక సినిమాలోని ఒకే పాటకి అటు లిరికల్, ఇటు వీడియో సాంగ్ కి ఈ రేంజ్ లో వ్యూస్ రావడం సౌత్ ఇండియాలోనే మొదటిసారి. దాంతో ఆ రికార్డుని రాములో రాములా దక్కించుకుంది. థమన్ అందించిన సంగీతం సినిమాని టాప్ లెవెల్లో నిలబెట్టడమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కి టాలీవుడ్ లో మొదటి స్థానాన్ని అందించింది.