Advertisementt

నాగార్జున మొదలెట్టేసాడు...

Thu 03rd Sep 2020 06:02 PM
nagarjuna,wild dog,solomon,shoot begins,telugu  నాగార్జున మొదలెట్టేసాడు...
Nagarjuna starts Shooting.. నాగార్జున మొదలెట్టేసాడు...
Advertisement
Ads by CJ

కరోనా కారణంగా ఐదు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. చిన్న హీరోలు రిస్క్ తీసుకుని మరీ షూటింగులకి వెళ్తున్నా పెద్ద హీరోలు మాత్రం అటు వైపు కూడా చూడడం లేదు. ఐతే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున అందరికంటే ముందుగా షూటింగ్ మొదలెట్టేసాడు. బిగ్ బాస్ కోసం షూటింగ్ చేసినప్పటికీ, తాజాగా తన చిత్రమైన వైల్డ్ డాగ్ కోసం బయటకి వచ్చాడు. సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ అయింది.

ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసారు. అందులో నాగార్జున కారులోంచి దిగుతూ సెట్ కి వెళ్లాడు. ఆ వెళ్లే క్రమంలో అడుగడుగునా జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు స్ప్రే చేసి తమతో పాటు ఎలాంటి సూక్ష్మజీవిని లోపలికి తీసుకెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ఇంకా సెట్ లో ఉన్న వారందరూ మాస్కులతో పాటు ఫేస్ షీల్డ్ లు ధరించారు. కాస్ట్యూమ్స్ కి కూడా స్ప్రే చేసి ఎలాంటి అపాయం ఏ విధంగానూ జరగకుండా చూసుకుంటున్నారు.

మొత్తానికి ఐదున్నర నెలల తర్వాత మళ్లీ నాగార్జున సెట్లోకి వచ్చాడు. మరి నాగార్జున చూపించిన దారిలో ఇంకెంత మంది నడుస్తారో చూడాలి.

click here for Video

Nagarjuna starts Shooting..:

Nagarjuna starts Shooting..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ