కరోనా కాలం ఓటీటీలకు బాగా కలిసొచ్చింది. థియేటర్స్ మూతబడడంతో ఓటీటీల హవా ఒక్కసారిగా ఊపందుకుంది. ఒకప్పుడు ఓటీటీలకు సినిమాలు అమ్మినా నిర్మాతలు ఎలా చెబితే అలా నడిచే ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి.. వీళ్ళ హవా పెరిగింది. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎలా చెబితే అలా అన్నట్టుగా ఉంది వ్యవహారం. అయితే ఓటీటీలో ఇండియా నెంబర్ వన్ అమెజాన్ ప్రైమ్, అదే విదేశాల్లో నెట్ ఫ్లిక్స్ కి మంచి క్రేజ్ ఉంది కానీ.. ఇండియా వైడ్ గా అమెజాన్ కున్న పాపులారిటీ మరి దేనికి లేదు. అయితే అమెజాన్ ప్రైమ్ అంతగా క్లిక్ అవడానికి కారణం ఏమిటి అంటే.. ప్రేక్షకులలోకి చేరువకావడానికి అమెజాన్ పబ్లిసిటీ బావుంది. అదే నెట్ ఫ్లిక్స్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అమెజాన్ అంత పాపులారిటీ నెట్ ఫ్లిక్స్ కి లేకపోవడంతో అమెజాన్‌కి మంచి పబ్లిసిటీ ఉండడంతో.. అమెజాన్ హైలో ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సినిమాలు కొన్నప్పటికీ.. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా తమ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసేస్తారు.
మొన్నామధ్యన రెండు మూడు సినిమాలను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఇలానే ఎలాంటి హడావిడి లేకుండా మిడ్ నైట్ విడుదల చేసేసారు. ఆ సినిమాలకు మౌత్ టాక్ బావుంది హిట్ టాక్ హిట్ రివ్యూస్ తెచ్చుకున్నాయి కానీ... లేదంటే ఆ హీరోలు దెబ్బైపోయేవారు. కానీ అమెజాన్ ప్రైమ్ అలా కాదు. తాము కొన్న పెద్ద సినిమాలను మంచి పబ్లిసిటీతో విడుదల చేస్తుంది. తాజాగా మీడియం బడ్జెట్ మూవీని కొన్న అమెజాన్ ప్రైమ్ వారు ఆ సినిమా పబ్లిసిటీని బీభత్సంగా చేస్తున్నారు. నాని ‘వి’ సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్న అమెజాన్ హడావిడి గత వారం రోజులుగా సోషల్ మీడియాని వేడెక్కిస్తుంది.
‘వి’ సినిమా సాంగ్స్‌ని అమెజాన్ ఒక్కక్కటిగా విడుదల చెయ్యడం.. నాని, సుధీర్ బాబు, నివేత థామస్ లు సోషల్ మీడియాలోనే ‘వి’కి పబ్లిసిటీ చెయ్యడంతో అమెజాన్‌లో విడుదలకాబోతున్న ‘వి’కి మంచి క్రేజ్ వచ్చేసింది. అమెజాన్ కూడా ‘వి’ కోసం విపరీతంగా పబ్లిసిటీ చేస్తుంది. మరి భారీ ధరకు కొన్నారు. ఆ సినిమాకి క్రేజ్ లేకపోతే వ్యూస్ ఉండవు. తర్వాత దెబ్బతినాలి. ఇలా సోషల్ మీడియాలో హడావిడి చేస్తే సినిమాకి హైప్ క్రియేట్ అయ్యి.. సినిమాకి వ్యూస్ పెరుగుతాయి. అదన్నమాట అమెజాన్ ప్రైమ్‌కి క్రేజ్ రావడానికి కారణం.