Advertisementt

చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనా?

Thu 03rd Sep 2020 08:19 PM
chiranjeevi,next project,lucifer remake,mega star,confusion  చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనా?
Mega Star Chiranjeevi in Confusion చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనా?
Advertisement
Ads by CJ

చిరంజీవి పుట్టిన రోజునాడు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ అంటూ ప్రచారం జరిగినా చిరు మాత్రం కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే చిరు ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడని, సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో లూసిఫర్ తెలుగు స్క్రిప్ట్ రెడీ అన్నారు. అంతలోనే చిరు లూసిఫర్ వదిలేస్తున్నాడని, సుజిత్ చెప్పిన తెలుగు స్క్రిప్ట్ చిరుకి నచ్చలేదని, మధ్యలో దర్శకుడు మారుతున్నాడనే టాక్ కూడా నడిచింది. ఈలోపు ప్లాప్ దర్శకులతో చిరు సినిమాలన్నారు. బాబీ ఒక కథ రెడీ చేసుకున్నాడని, చిరు ఓకే చెప్పాడన్నారు. అలాగే మెహెర్ రమేష్ తో వేదాళం రీమేక్ అన్నారు. చిరు పుట్టిన రోజునాడు బాబీ సినిమా అయినా, లేదా వేదాళం రీమేక్ మెహెర్‌తో అయినా ప్రకటించేస్తున్నారనుకున్నారు.

కానీ ఎలాంటి చడీ చప్పుడు లేదు. కానీ తాజాగా చిరు ఆచార్య తర్వాత లూసిఫర్ చేసే ఆలోచనలోనే ఉన్నాడట. అందుకే మెహెర్ రమేష్, బాబీ సినిమాలను హోల్డ్‌లో పెట్టాడట. త్రివిక్రమ్‌తో సినిమా కూడా లూసిఫర్ రీమేక్ తర్వాతే అని చిరు ఆలోచనలో ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. అయితే చిరు ఆచార్య తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక కన్ఫ్యూజన్‌కి గురవుతున్నాడని, అందుకే ఎలాంటి ప్రాజెక్ట్‌ని ప్రకటించడం లేదని అంటున్నారు. కాని ఆచార్య తర్వాత చిరు లూసిఫర్ రీమేక్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.

Mega Star Chiranjeevi in Confusion:

What is the Mega Star Chiranjeevi next Project?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ