Advertisementt

పవన్, త్రివిక్రమ్ భజన మొదలెట్టేశాడుగా..!

Thu 03rd Sep 2020 06:56 PM
bandla ganesh,trivikram srinivas,greatness,pawan kalyan  పవన్, త్రివిక్రమ్ భజన మొదలెట్టేశాడుగా..!
Bandla Ganesh Praises on Pawan and Trivikram పవన్, త్రివిక్రమ్ భజన మొదలెట్టేశాడుగా..!
Advertisement
Ads by CJ

ఇండస్ట్రీలో దేవుడు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకునే భక్తుడు బండ్ల గణేష్. తన దేవుడు తనకి కరోనా వస్తే పలకరించలేదని ఫీలయిన బండ్లని మళ్లీ దేవుడితో సినిమా చేస్తారా అని అడిగితే.. నేను నా దేవుడు అవకాశం ఇస్తే ఆయనతో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నట్టుగా బండ్ల.. పవన్ భజన చేస్తున్నాడు. బండ్ల గణేష్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో హైలెట్ అవుతున్నట్లుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పాటుగా ఆయన ఫ్రెండ్ త్రివిక్రమ్‌ని కూడా తెగ పొగిడేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఆప్తుడెవరైనా ఉన్నారంటే అది త్రివిక్రమే అని చెబుతున్నాడు బండ్ల గణేష్.

తన వ్యక్తిగత విషయాలను, సొంత విషయాలను కూడా త్రివిక్రమ్‌తో కలిసి షేర్ చేసుకుంటా అని, త్రివిక్రమ్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఎత్తడు. రెండు రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేస్తాడని, నా వ్యక్తిగత విషయాలను ఎలాంటి భయం లేకుండా త్రివిక్రమ్‌తోనే షేర్ చేసుకుంటానని అంటున్నారు. ఆయన నాకు ఏది చెప్పిన కరెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీలో సొంత విషయాలను షేర్ చేసుకుంటే... ఉపయోగం సంగతి పక్కనబెట్టి..నష్టం ఎక్కువ ఉంటుంది. కానీ త్రివిక్రమ్ గారితో చెప్పుకుంటే అది బ్యాంకు లాకర్ లో ఉన్నట్టే అందుకే త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టమని, కానీ ఆయనతో ఇంతవరకు సినిమా చేయలేకపోయా అంటున్నాడు బండ్ల. మరి దేవుడిని, దేవుడి ఫ్రెండ్ ని కలిపి పొగిడితే వాళ్ళ కాంబోలో తెరకెక్కే సినిమా అవకాశం తనకే వస్తుంది అని బండ్ల గణేష్ ప్లాన్ ఏమో.

Bandla Ganesh Praises on Pawan and Trivikram:

Bandla Ganesh talks about Trivikram Srinivas Greatness

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ