ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుండో కోరుకుంటున్నట్టుగా బాలివుడ్ దర్శకుడితో సినిమా ఓకే అయినప్పటి నుండి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదిపురుష్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. రామాయణ ఇతిహాస గాథలోని అంశాలని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా నుండి మరో సర్ప్రైజ్ రాబోతుంది. ఈ మేరకు ప్రభాస్, తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడి చేసారు. ప్రభాస్ పెట్టిన పోస్ట్ లో ఈ విధంగా ఉంది. ఏడువేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివిగల దుష్టశక్తి అంటూ పోస్ట్ చేసాడు. ఆ దుష్టశక్తి ఏమిటో రేపు ఉదయం 7గంటల 11నిమిషాలకి వెల్లడి చేస్తాడట. ఈ మేరకు డార్లింగ్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. మరి ఆ దుష్టశక్తి ఏమిటో, అంత తెలివి ఏమిటో రేపు తెలుస్తుందన్నమాట.