పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలంటూ రెండు పడవల మీద కాళ్ళేసుకుని కూర్చున్నాడు. రాజకీయాలతో పాటుగా సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రెండు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి త్రివిక్రమ్‌తో చెయ్యాల్సిన కోబలి, రెండోది సత్యాగ్రహి. ఇప్పుడు ఈ సత్యాగ్రహి అనేది ఎందుకు హైలెట్ అవుతుంది అంటే నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునాడు.. కొంతమంది పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజ్ విషెస్ చెప్పడానికే ఈ సత్యాగ్రహి పోస్టర్ ని పెట్టి విషెస్ చెబుతున్నారు. పవన్ రాజకీయాల్లోకి రాకపోతే త్రివిక్రమ్‌తో అజ్ఞాతవాసి తర్వాత కోబలి సెట్స్ మీదకెల్లేది. ఇక సత్యాగ్రహి కూడా అంతే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి చేయకపోవడానికి కారణం చెబుతున్నాడు.
అదేమిటంటే తాను సత్యాగ్రహి సినిమాని మొదలు పెట్టి ఆపేశానని, అయితే సత్యాగ్రహి పోస్టర్‌లో ఒక వైపు జయప్రకాశ్ నారాయణ్ ఫోటో పాటుగా మరోవైపు చేగువేరా ఫోటో ఉంటుంది అని... అయితే తాను సినిమాల్లో ఉండి సినిమాల్లో చేసే పోరాటం వేరని, రాజకీయాల్లోకి వచ్చి పోరాడితేనే ఫలితం ఉంటుంది అని, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఏం చేస్తున్నానో అదే సత్యాగ్రహి సినిమాలో చెయ్యాలనుకున్నా అని, అందుకే సత్యాగ్రహి సినిమాని ఆపేశానని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే సత్యాగ్రహి సినిమా ఆపేసినప్పుడు పవన్‌ని చాలామంది తిట్టారట. ఆ విషయం కూడా చెప్పిన పవన్ కళ్యాణ్ సత్యాగ్రహిని చేసే ఛాన్స్ ఇక లేదంటూ సత్యాగ్రహి పవన్ కెరీర్‌లో ఇక ఉండదని స్పష్టం చేసాడు.