కరోనాకి ముందు కరోనాకి తర్వాత అని చెప్పాల్సిన పరిస్థితిని తెచ్చింది కరోనా మహమ్మారి. కరోనా రాకముందు థియేటర్స్‌లో ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా విడుదలవుతుండేది. చిన్న సినిమాలైతే వారం వారం థియేటర్స్‌లో సందడి చేసేవి. ఒకేసారి నాలుగైదు సినిమాలు కూడా విడుదలైతే.. పెద్ద సినిమాలకు రెండు వారాల గ్యాప్ ఉండేది. పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ మూవీస్ గనక రెండు వారాల గ్యాప్‌తో మూవీస్ థియేటర్స్‌లోకి వచ్చేవి. కానీ ఇప్పుడు థియేటర్స్ మూత పడ్డాయి. కరోనా కారణంగా దాదాపుగా ఐదునెలలుగా థియేటర్స్ మూతపడ్డాయి. ఇక ఓటిటీల హవా మొదలయ్యింది. ఈ ఐదు నెలలో ఓటిటిలలో చాలా చిన్న సినిమాలు విడుదలయ్యాయి.
అయితే తాజాగా ఓటిటిస్‌లో మీడియం రేంజ్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అన్ని భాషల వారి సినిమాలను ఓటిటి వారు కొనేస్తున్నారు. అయితే తాజాగా నాని ‘వి’ వచ్చే ఐదో తారీఖున అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. ఇక తమిళనాట సూర్య సినిమాని కూడా అమెజాన్ ప్రైమ్ కొనేసింది. అయితే ఆ సినిమాని అమెజాన్.. సెప్టెంబర్ చివరిలో విడుదల చేయబోతుంది. మరి నాని వి తర్వాత 20 రోజుల్ గ్యాప్ తో సూర్య సినిమా రాబోతుంది. ఒకవేళ అనుష్క నిశ్శబ్దం సినిమాని కొన్నా, అదే ఉప్పెన సినిమాని కొన్న అమెజాన్ వారు మరో రెండు నెలల గ్యాప్‌లో ఈ సినిమాలు ప్లే చేస్తారు. మరి థియేటర్స్‌లో వారం వారం బొమ్మ పడితే.. ఓటిటిస్ లో వారానికో బొమ్మ కాదు... నెలకో బొమ్మ అన్నమాట.