మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య చిత్రం చేస్తున్న కొరటాల శివ ఆ తర్వాత ప్రాజెక్టుని బన్నీతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో తెలియదు. కాకపోతే సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అదలా ఉంటే బన్నీతో తెరకెక్కిస్తున్న చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా బన్నీ- కొరటాల కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి మ్యూజిక్ ఎవరు అందిస్తున్నారనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మొదటగా మణిశర్మ సంగీతం ఇస్తున్నాడని వినిపించింది. ఇప్పుడు తాజాగా దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరమీదకి వచ్చింది. కొరటాల శివ మిర్చి సినిమా దగ్గరి నుండి భరత్ అనే నేను వరకు అన్ని చిత్రాలకి దేవినే మ్యూజిక్ చేసాడు. కానీ ప్రస్తుతం రూపొందిస్తున్న ఆచార్య చిత్రానికి మణిశర్మని పెట్టుకున్నాడు.
దాంతో దేవితో రిలేషన్ కట్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. కాకపోతే బన్నీతో సినిమా సెట్ అయిన కారణంగా మళ్లీ ఆ రిలేషన్ సెట్ అయిందని అంటున్నారు. అందువల్ల దేవిని తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయమై అధికారికంగా సమచారం వస్తుందేమో చూడాలి.