పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఫ్లెక్సీ బ్యానర్లు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మరణించిన వార్త అందరినీ తీవ్రంగా కలచివేసింది. చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మొత్తం 13మందికి షాక్ తగలగా ముగ్గురు మరణీంచారు. ఇంకా నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఐతే తన పుట్టినరోజు వేడుకల్లో చోటు చేసుకున్న విషాదంపై పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు. మాటలకి అందని విషాదం అంటూ ఈ ఘటన తన మనసుని బాగా కలచి వేసిందని అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి దూరమైన బిడ్డలని తీసుకురాలేనని, కానీ వారిని ఒక కొడుకుగా ఉంటానని, ఆర్థికంగా ఆ కుటుంబాలని ఆదుకుంటానని చెప్పారు. ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అభిమానులకి మెరుగైన వైద్యం అందిస్తానని, వారికి ఎలాంటి అవసరం ఉన్నా తక్షణమే అందించాలని స్థానికి జనసైనికులకి పిలుపినిచ్చారు.