Advertisementt

పూజా హెగ్డే వాయిస్‌ని మెచ్చిన నటి ఎవరు?

Wed 02nd Sep 2020 10:05 PM
pooja hegde,heroine,praises,voice,aravinda sametha,dubbing  పూజా హెగ్డే వాయిస్‌ని మెచ్చిన నటి ఎవరు?
Heroine Praises Pooja Hegde Voice పూజా హెగ్డే వాయిస్‌ని మెచ్చిన నటి ఎవరు?
Advertisement
Ads by CJ

 

ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న పూజా హెగ్డేకి అందం ఉన్నా అభినయం లేదనేది జగమెరిగిన సత్యం. కేవలం గ్లామర్ ప్రాధాన్యమున్న పాత్రల్తోనే స్టార్ హీరోల చాయిస్‌గా మారిన పూజా హెగ్డే నటనకి మైనస్ మార్కులు పడుతుంటాయి. ఇప్పటివరకు తనని తాను నిరూపించుకునే పాత్ర రాలేదనే చెప్పాలి. అయినా పూజా హెగ్డే సుడి ఎలా ఉంది అంటే స్టార్ హీరోస్ మెయిన్ చాయిస్ ఎవరయ్యా అంటే ఇక పూజా హెగ్డే తప్ప మరో హీరోయిన్ కనిపించడం లేదు. అయితే తాజాగా లాక్ డౌన్ నుండి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న హీరోయిన్స్ కన్నా ముందు పూజా హెగ్డేనే షూటింగ్ కి బయలుదేరుతుంది. షూటింగ్స్ పెట్టండి నేను రెడీ అంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ తనని తన నటనని ఆయా భాషల్లో చాలామంది పొగుడుతుంటారని... ఆ ప్రశంసలన్నిటిలో తనని ఓ హీరోయిన్ పొగడడం మాత్రం ఎప్పటికి మరిచిపోలేనని చెబుతుంది పూజ.

తాను గతంలో తన పాత్రలకి డబ్బింగ్ చెప్పుకునేదాన్ని కాదని.. కానీ అరవింద సమేత సినిమా అప్పుడు అరవింద పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా అని.. అయితే ఆ డబ్బింగ్ చెప్పింది నేను అని తెలియక ఓ టాప్ హీరోయిన్ అరవింద సమేతలో నీ పాత్రకి ఎవరు డబ్బింగ్ చెప్పారో కానీ.. నా తర్వాత సినిమాలో ఆమెతోనే నేను డబ్బింగ్ చెప్పించుకుంటానని అడగడం నా గొంతుని, నా డబ్బింగ్ ని పొగడడం మాత్రం ఎప్పటికి మరిచిపోలేనని అంటుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది పేరు చెప్పనని చెబుతుంది పూజా హెగ్డే. కానీ ఆమె పొగుడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది అని చెబుతుంది. ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్‌తో రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీలోనూ, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తుంది.

Heroine Praises Pooja Hegde Voice :

Pooja Hegde Happy with Praises on Her Voice 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ