నాగశౌర్య ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చాడని చాలామంది అనుకుంటారు. ఇంఫాక్ట్ నాగశౌర్యకి సినిమా ఇండస్ట్రీలో చుట్టాలు ఉన్నట్లుగా ఎవ్వరికి తెలియదు. ఊహలు గుసగుసలాడే దగ్గరనుండి నిన్నమొన్నటి అశ్వద్ధామ వరకు నాగశౌర్య హీరోగా స్టార్ రేంజ్ చేరుకోవడానికి తంటాలు పడుతున్నాడు. చివరికి సొంతంగా నిర్మాణ సంస్థ కూడా మొదలు పెట్టాడు. అయితే తాజాగా నాగశౌర్య మేనత్త.. గతంలో సినిమా ఇండస్ట్రీలో చెల్లెలి కేరెక్టర్స్ చేసి క్రేజ్ తెచ్చుకున్న లతాశ్రీ అనే విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. తాజాగా లతాశ్రీ నాగశౌర్య తన మేనల్లుడని.. కానీ తనని మేనత్తగా చెప్పుకోవడానికి నాగశౌర్య ఫ్యామిలీ పెద్దగా ఇష్టపడరని చెబుతుంది. నా అన్నయ్య (శౌర్య) కానీ నా మేనల్లుడు కానీ తమకి ఇండస్ట్రీలో బంధువులు ఉన్నారని చెప్పుకోరు.
కానీ నాకు అన్నయ్య ఉండి లేడని చెప్పుకోలేను. మీకెవరైనా ఉన్నారా అంటే అన్నయ్య ఉన్నాడని చెబుతాను. మా అన్నయ్య నా మధ్య పెద్దగా గొడవలు లేకపోయినా.. చిన్న చిన్న మిస్ అండర్ స్టాండింగ్స్ ఉన్నాయి.. అంతే కానీ ఇంకేం లేదని అంటుంది. అన్నయ్య, మేనల్లుడు మన వాళ్ళైనా వదిన మనది కాదుగా అంటూ నాగశౌర్య ఫ్యామిలీ గురించి లతాశ్రీ చెబుతున్న విషయాలివి. అయితే నాగశౌర్యని లతాశ్రీనే సినిమాల్లోకి తీసుకొచ్చింది అనేది కేవలం ప్రచారం కాదని, నిజమని లతాశ్రీ చెప్పకపోయినా.. నాగశౌర్య ఎలా సినిమాల్లోకి వచ్చాడో అందరికి తెలుసు అంటూ చివరిలో ట్విస్ట్ ఇచ్చింది. మరి నాగశౌర్య మేనత్తకి ఆయన ఫ్యామిలీకి ఏం గొడవలున్నాయో వారికే తెలియాలి.