Advertisementt

పవన్ కళ్యాణ్ ని విష్ చేస్తూ సీడీపీ వదిలిన అజిత్ ఫ్యాన్స్..

Tue 01st Sep 2020 08:23 PM
pspk,pawan kalyan,pawankalyanbirthday,ajith fans,cdp  పవన్ కళ్యాణ్ ని విష్ చేస్తూ సీడీపీ వదిలిన అజిత్ ఫ్యాన్స్..
Common DP of Pawan Kalyan from Ajith Fans.. పవన్ కళ్యాణ్ ని విష్ చేస్తూ సీడీపీ వదిలిన అజిత్ ఫ్యాన్స్..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రేపే. సెప్టెంబర్ 2వ తేదీ కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అటు రాజకీయంగా, ఇటు సినిమా పరంగా అభిమానులంతా కలిసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలని ఘనంగా సెలెబ్రేట్ చేయనున్నారు. కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తూ ఆన్ లైన్ వేదికగానే ఈ సంబరాలు ఉండనున్నాయి. మరోవైపు పవన్ అభిమానుల కోసం అప్డేట్లు రానున్నాయి. వకీల్ సాబ్ సినిమా మోషన్ పోస్టర్ తో పాటు ఇతర సినిమాల అప్డేట్లు బయట పెట్టనున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ అభిమానులకి మరో గిఫ్ట్ అందింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని హీరో అజిత్ ఫ్యాన్స్ కామన్ డీపీని వదిలారు. జనసేనాని అంటూ ఉన్న డీపీలో పవన్ కళ్యాణ్ తో పాటు అజిత్ ఉన్నారు. ఒక హీరో పుట్టినరోజుకి మరో హీరో అభిమానులు కామన్ డీపీని వదలడం చాలా అరుదు.

ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. తాము ఎంతో అభిమానంగా ఆరాధించే హీరో గురించి మరో హీరో అభిమానులు పొగడడం నిజంగా ఎవరికైనా మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. నేటి నుంచే స్టార్ట్ అయిన ఈ సర్పైజ్ లు రేపటి వరకూ కొనసాగనున్నాయి. రేపు ఇంకెన్ని గిఫ్టులు వస్తాయో చూడాలి. 

Common DP of Pawan Kalyan from Ajith Fans..:

Common DP of Pawan Kalyan from Ajith Fans..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ