మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ విడుదలయినప్పటి నుండి అంచనాలు మరింతగా పెరిగాయి. ఐతే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని కొరటాల భావిస్తున్నాడట. అందుకోసం ఆల్రెడీ డేట్లు కూడా అనుకున్నాడట. ఏప్రిల్ 9 లేదా మే 7వ తేదీన ఆచార్యని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కొరటాల చూస్తున్నాడట.
ఐతే ప్రస్తుతం కరోనా వల్ల ఆచార్య షూటింగ్ మళ్లీ మొదలెట్టలేదు. ఇంకా ఎప్పుడు మొదలెడతారో క్లారిటీ లేదు. కరోనా ఉధృతి ఇలానే ఉంటే షూటింగ్ మొదలెట్టడం కష్టం అవుతుంది. కాకపోతే మరో రెండు నెలలు పోతే అంటే కరోనా నెమ్మదిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడు షూటింగ్ రీస్టార్ట్ చేస్తే బాగుంటుందని కొరటాల అనుకుంటున్నాడట. అంటే నవంబరు లేదా డిసెంబరులో చిత్రీకరణ మొదలెట్టి చకచకా కంప్లీట్ చేసుకుని వేసవిలో విడుదలకి సిద్ధంగా ఉంచుతాడట. మరి కొరటాల అనుకుంటున్నట్టుగా అన్నీ సవ్యంగా కుదిరితే బాగానే ఉంటుంది కానీ ఏం జరుగుతుందో చూడాలి.