పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదే ఉంది. ఇది కాక మరో రెండు సినిమాలని ప్రకటించిన పవన్ కళ్యాణ్, వాటి పనులని వేగవంతం చేసే పనిలో ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న విరూపాక్ష చిత్రీకరణ ఆల్రెడీ స్టార్ట్ చేసాడు. ప్రస్తుతానికి కరోనా వల్ల ఈ సినిమా చిత్రీకరణ కొద్ది రోజుల పాటు నిలిచిపోయింది. ఐతే విరూపాక్ష అనంతరం హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ వంటి చిత్రాన్ని అందించిన హరీష్ శంకర్ తో మళ్ళీ సినిమా చేయనుండడంతో ఆ అంచనాలు మరో రేంజికి వెళ్ళాయి. ఐతే ఈ కాంబోలో వస్తున్న సినిమా నుండి అప్డేట్ రాబోతుంది. పవర్ స్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని పవన్- హరీష్ సినిమాపై అప్డేట్ వస్తుందని ప్రకటించారు. దీంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.