Advertisementt

సునీల్ మళ్లీ హీరో అయ్యాడుగా...

Mon 31st Aug 2020 01:25 PM
sunil,harish shankar,vedantham raghavaiah,14reelsplus  సునీల్ మళ్లీ హీరో అయ్యాడుగా...
Sunil New Movie Vedantham Raghavaiah.. సునీల్ మళ్లీ హీరో అయ్యాడుగా...
Advertisement
Ads by CJ

కమెడియన్ సునీల్ హీరోగా మారిన తర్వాత కమెడియన్ గా మళ్ళీ కనిపించలేదు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూల రంగడు చిత్రాల ద్వారా మంచి విజయాలు రావడంతో హీరోగానే కంటిన్యూ అయ్యాడు. ఐతే హీరోగా ఎక్కువ సినిమాల్లో కనిపించినప్పటికీ నిలబడలేకపోయాడు. దాంతో మళ్ళీ బ్యాక్ టు కామెడీ అంటూ కమెడియన్ గా ప్రయత్నించాడు. త్రివిక్రమ్ సినిమాల ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ పాత్రలకి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు.

దాంతో అటు విలన్ గానూ ప్రయత్నించాడు. డిస్కోరాజా సినిమాలో విలనిజం ప్రదర్శించాడు. ప్రస్తుతం కలర్ ఫోటో చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా దర్శనమివ్వనున్నాడు. ఐతే ఇటు విలన్ గా, కమెడియన్ గా సినిమాలు చేస్తున్న సునీల్, మళ్లీ హీరోగా సినిమా చేయడేమోనని అనుకున్నారు. కానీ అలా అనుకున్న వాళ్ళందరికీ షాక్ ఇస్తూ సునీల్ కొత్త చిత్రం ప్రకటించాడు. వేదాంతం రాఘవయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందిస్తున్నారు.

14రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు తదితర విషయాలేవీ ఇంకా ప్రకటించలేదు.

Sunil New Movie Vedantham Raghavaiah..:

Sunil New Movie Vedantham Raghavaiah..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ