Advertisementt

థియేటర్స్‌ ఓపెన్‌కి ఇంకా నెల ఉంది.. ఇప్పుడైనా?

Tue 01st Sep 2020 05:59 PM
nishabdham,ram,v movie,nani,red movie,ott release  థియేటర్స్‌ ఓపెన్‌కి ఇంకా నెల ఉంది.. ఇప్పుడైనా?
Hero Nani Safe with V Movei OTT Release థియేటర్స్‌ ఓపెన్‌కి ఇంకా నెల ఉంది.. ఇప్పుడైనా?
Advertisement
Ads by CJ

రేపు ఒకటో తారీఖున సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి.. ఇంకేంటి సినిమాలు థియేటర్స్‌లో విడుదల కాబోతున్నాయని చాలామంది అనుకున్నారు. సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే టైం లో నాని వి ని అనవసరంగా ఓటిటి కి అమ్మేశాడు అన్నారు. ఐదు నెలలుగా బేరం కుదరక ఆగిపోయిన నాని వి సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యే సమయానికి అమెజాన్ ప్రైమ్‌కి ఇచ్చేశారు అయ్యో అనుకుంటే.. తాజాగా నాని నిర్ణయం ఎంత కరెక్టో కేంద్రం చెప్పింది. అంటే కరోనా అన్ లాక్ 4.ఓ లో సెప్టెంబర్ నెలాఖరు వరకు థియేటర్స్ బంద్ నడుస్తుంది. థియేటర్స్ మరో నెల ఓపెన్ కావని కేంద్ర స్పష్టం చేసింది. దానితో నాని ‘వి’ ని అమెజాన్‌కి అమ్మెయ్యడమే కరెక్ట్ అంటున్నారు. ఇంకా థియేటర్స్ తెరుచుకుంటాయి.. మా సినిమా థియేటర్స్‌లో అని ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు ఓటిటిలకు ఓకే చెప్పాల్సిందే.

నిశ్శబ్దం అనుష్క, ఉప్పెన వైష్ణవ్ తేజ్, రామ్ రెడ్ సినిమాలకు ఓటిటి నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. నాని ఎలాగో ముందడుగు వేసి ‘వి’ ని అమ్మేసి క్యాష్ చేసుకున్నాడు. కానీ అనుష్క అండ్ నిశ్శబ్దం టీం కానీ, ఉప్పెన టీం కానీ, రెడ్ రామ్ టీం కానీ ఈ ఓటిటీలలో సినిమాల విడుదలకు ఇంకా మొగ్గు చూపడం లేదు. మరి ఇప్పుడు మరో నెల థియేటర్స్ వాయిదా అన్న నేపథ్యంలో అయినా నాని లాగ నిశ్శబ్దం, ఉప్పెన సినిమాలేమైనా ఓటిటీలకు ఓకే చెబుతాయో.. లేదంటే ఐదు నెలలు వేచి చూసాం.. మరో నెల వేచి చూడలేమా అని అనుకుంటారో కానీ.. ఇప్పుడు ప్రేక్షకులైతే ఓటిటి అయినా ఒకటే, థియేటర్స్ అయినా ఒకటే అంటున్నారు. కాకపోతే.. థియేటర్స్‌కి వస్తారా? అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. రామ్ ఎలాగూ రెడ్‌ని ఓటిటికి ఇవ్వడు, ఇచ్చే ఉద్దేశ్యం లేదు. కానీ ఉప్పెన, నిశ్శబ్దం మాత్రం ఎట్టకేలకు ఓటిటీలకు ఓకే చెప్పినా.. ఇప్పుడున్న పరిస్థితులలో ఆశ్చర్యపోవక్కర్లేదు.

Hero Nani Safe with V Movei OTT Release:

Uppena, nishabdham, Red movie team in Confusion

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ