Advertisementt

సుధీర్ బాబు కోరిక నెరవేరుతుందా..?

Sun 30th Aug 2020 07:07 PM
sudheer babu,v the movie,mahesh babu,telugu  సుధీర్ బాబు కోరిక నెరవేరుతుందా..?
Will Sudheer babu dream come true..? సుధీర్ బాబు కోరిక నెరవేరుతుందా..?
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుండి వచ్చిన సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం అతడు నటించిన వి చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. నాని హీరోగా చేసిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించారు. మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని, ఇటు నాని నటనతో పాటు సుధీర్ బాబు ఇరగదీసాడని అంటున్నారు.

ఐతే ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవనున్న నేపథ్యంలో ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుధీర్ బాబు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. సమ్మోహనం తర్వాత ఇంద్రగంటి సినిమాలో చేస్తున్న సుధీర్ బాబుకి వి చిత్రంపై బాగా నమ్మకం ఉందట. ఈ సినిమా తర్వాత మరిన్ని మల్టీస్టారర్ లు రూపొందుతాయని, తనకైతే మహేష్ బాబుతో మల్టీస్టారర్ చేయాలనుందని బయట పెట్టాడు.

ఐతే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేదా అనేదే ప్రశ్న. సుదీర్ బాబు ఏ పాత్రలో అయినా సెట్ అవుతాడు. అతడి నుండి వచ్చిన సినిమాలన్నీ ఎంత విభిన్నంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. అదీగాక మహేష్ బావ కాబట్టి మహేష్ సినిమాలో చేస్తే ఆ హైప్ మరో రేంజ్ లో ఉంటుంది. మరి ఎప్పటికైనా సుధీర్ బాబు అనుకున్నట్టు మహేష్ తో మల్టీస్టారర్ సెట్ అవుతుందేమో చూడాలి.

Will Sudheer babu dream come true..?:

Will Sudheer babu dream come true..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ