Advertisementt

సైరా దర్శకుడి తర్వాతి చిత్రం పవర్ స్టార్ తోనే..?

Sun 30th Aug 2020 08:59 AM
surender reddy,pspk,pawan kalyan,telugu,megastar chiranjeevi  సైరా దర్శకుడి తర్వాతి చిత్రం పవర్ స్టార్ తోనే..?
Surender Reddy Next with PK..? సైరా దర్శకుడి తర్వాతి చిత్రం పవర్ స్టార్ తోనే..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత ఆ దర్శకుడి నెక్ట్ చిత్రంపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ బిజీగా ఉండడంతో సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఏ హీరోతో ఉంటుందనే విషయమై అనేక వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో సినిమా కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు.

వకీల్ సాబ్, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష, హరీష్ శంకర్ తో మరో సినిమా.. ఇలా వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాతి చిత్రాన్ని సురేందర్ రెడ్డితో చేయడానికి సిద్ధం అయ్యాడట. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడట. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్లో మంచి బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా రూపొందనుందని వినబడుతోంది.

ఈ విషయమై అధికారిక సమాచారం మరికొద్ది రోజుల్లో వెలువడనుందట. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సెప్టెంబరు 2వ తేదీన ఈ సినిమాపై అప్డేట్ రానుందని అంచనా వేస్తున్నారు. చూడాలి ఏం జరగనుందో..!

Surender Reddy Next with PK..?:

Surender Reddy Next with PK..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ